![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -88 లో.....సూర్య తన అన్న వీరు గురించి నిజం చెప్పబోతుంటే అప్పుడే వీరు మనుషులు వస్తారు. వాళ్ళని చూసి సూర్య అక్కడ నుండి పారిపోతాడు. ఆ తర్వాత కాసేపటికి టిఫిన్ సెంటర్ దగ్గరికి రుద్ర వస్తాడు. గంగ టవల్ తో తనని గుర్తు పట్టకుండా కవర్ చేస్తుంది. రుద్రకి టిఫిన్ సెంటర్ ఓనర్ సూర్య మాట్లాడిన వీడియో చూపిస్తాడు. అందులో రుద్ర నేనొక విషయం చెప్పాలని మాత్రమే ఉంటుంది. దాంతో రుద్ర అక్కడి నుండి వెళ్తాడు.
ఆ తర్వాత రుద్రని సూర్య చూసి వెళ్ళబోతుంటే.. వీరు మనుషులు అక్కడే ఉన్నారని ఆగిపోతాడు. సూర్య కోసం రుద్ర వెతుకుతుంటే అప్పుడే మక్కం కనిపిస్తాడు.. మీరేంటి ఇక్కడ అని రుద్ర అడుగుతాడు. గంగ ఆ టిఫిన్ సెంటర్ లో వర్క్ చేస్తుందని తన ఫ్లాష్ బ్యాక్ చెప్తారు. అలా చెప్పగానే రుద్ర తన వంక చూస్తాడు. సరే మీరు తనని ఫాలో అవ్వండి.. తన సేఫ్టీ ఇంపార్టెంట్ అని చెప్పి రుద్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరొకవైపు వీరు మనుషులు వీరుకి ఫోన్ చేసి రుద్ర తప్పించుకున్నాడని చెప్తాడు. అంతేకాకుండా రుద్రని కలవడానికి సూర్య ట్రై చేస్తున్నాడని చెప్తారు. దాంతో నో రుద్రని వాడు కలవడానికి వీల్లేదని వీరు అంటాడు. అప్పుడే ఇంట్లో వాళ్లంతా వస్తారు.
ఏంటి రుద్రని కలవకూడదంటున్నావని పెద్దసారు అడుగుతాడు. ఇప్పుడు పొలిటికల్ మూమెంట్ కదా పార్టీ తరుపున రుద్ర బావగారిని పోటీ చెయ్యమంటున్నారు.. ఎలాగా బాను బావ పాలిటిక్స్ ద్వారా ప్రజలకి సేవ చెయ్యాలని కోరిక కదా అని వీరు కవర్ చేస్తాడు. నా బాను కోరిక అదే అయితే పోటీ చేసేది రుద్ర కాదు వీరు అని శకుంతల అనగానే అందరు షాక్ అవుతారు. వీరు హ్యాపీగా ఫీల్ అవుతాడు. సర్లే ఇప్పుడు రుద్రకి ఈ టెన్షన్ వద్దని పెద్ద సర్ లైట్ తీసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |